Category: జిల్లా వార్తలు

వెల్దండ మండల వ్యాప్తంగా వెల్లువిరిసిన గణపతి పూజా కార్యక్రమాలు

వెల్దండ :వెల్దండ మండల వ్యాప్తంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి సర్పంచ్ ముట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను ముదిరాజ్, డిసిసి ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి దంపతులు, రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి,మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అదేవిధంగా మండలంలోని ఆయా గ్రామాలలో కూడా…

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎస్. జగదీశ్వర్‌కు మిత్రబృందం ఘన సన్మానం

శంకర్‌పల్లి : విద్యారంగంలో విశిష్ట సేవలు అందించి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు ఎస్. జగదీశ్వర్‌కు ఆయన మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శంకర్పల్లిలోని వైభవం బ్యాంకెట్ హాల్ లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై అవార్డు...

తలకొండపల్లిలో మట్టి వినాయకుల ఉచిత పంపిణీ

తలకొండపల్లి: కల్వకుర్తి నియోజకవర్గం, తలకొండపల్లి మండల కేంద్రంలో జై శ్రీరాం యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యూత్ వ్యవస్థాపకులు పద్మ అనిల్ ముదిరాజ్, అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పద్మ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విగ్రహాలను శ్రీకాంత్ యాదవ్ అందించారు.వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. మట్టి…

జిల్లా గ్రంథాలయంలో పారిశుద్ధ్య లోపాలు పిచ్చి మొక్కలు, దోమలతో విద్యార్థుల ఇబ్బందులు.

జనగామ జిల్లా కేంద్ర గ్రంథాలయం పరిసరాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య లోపాలతో దోమలు, ఇతర కీటకాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు దోమల నివారణకు ఫాగింగ్, మందు పిచికారీ చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

వినాయక చవితి రోజు కూడా ఆగని సేవ – సుంకిరెడ్డి కంటి శిబిరానికి పోటెత్తిన జనం

కడ్తాల్ సెప్టెంబర్ 14: కడ్తాల్ ఎంబీఏ గార్డెన్స్ లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో, శంకర నేత్రాలయ చెన్నై వారిచే నిర్వహిస్తున్న 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 4వ రోజు కూడా నిరంతరాయంగా కొనసాగింది.వినాయక చవితి పండుగ రోజున కూడా శిబిరానికి సెలవు లేకుండా వైద్య సేవలు కొనసాగడంతో కడ్తాల్ మండలం, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు రోజులలో…

వెల్దండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కొలువైన గణనాధుడు

వెల్దండ, సెప్టెంబర్ 14:వెల్దండ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు హరి కిషన్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్య గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్, పర్వత్ రెడ్డి, ప్రసాద్ గౌడ్, రామకృష్ణ, పుల్లయ్య, వెంకట్ నాయక్, లాలు నాయక్, భరత్ గౌడ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ షాక్ బాధితుడికి భాస్కర్ రావు భరోసా – రూ. 20 వేల ఆర్థిక సాయం

వెల్దండ సెప్టెంబర్ 14: వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు గారు మానవత్వం చాటుకున్నారు.చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు 15 రోజుల క్రితం విద్యుత్ షాక్ కు గురై కల్వకుర్తి మహిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రావు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, చెదురుపల్లి సర్పంచ్ దన్సింగ్ నాయక్…

ఎంపీ ఆర్ కృష్ణయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆంజనేయులు గౌడ్

వెల్దండ సెప్టెంబర్ 13: జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.ఆర్. కృష్ణన్నను వెల్దండ మండలంలోని బొల్లంపల్లి వాస్తవ్యులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ సత్తురి ఆంజనేయులు గౌడ్ కలిసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్లుగా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్న కృష్ణన్న సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయన ఆయురారోగ్యాలతో మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.