Category: నాగర్‌కర్నూల్

ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం

వెల్దండ ఆగస్టు 31: ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్ ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రి ఖర్చులకు ఇబ్బందిగా ఉన్న విషయాన్ని గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సోమవారం బాధిత కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందజేశారు. సందర్భంగా సర్పంచ్ మరియు బాలిక కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య యాదవ్, సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ యువ నాయకులు ఎండి సద్దాం, కాలూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక

ఆమనగల్ మున్సిపాలిటీ మరియు కడ్తాల్ మండలం  కర్కల్  పహాడ్ గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి  హాజరై అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల పండుగకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, కౌన్సిలర్స్ మొక్తల వెంకటయ్య, నాగిళ్ళ జగన్,ఎర్రవోలు మహేష్,ఎనుముల రమేష్, కర్కల్ పహాడ్ గ్రామం సర్పంచ్ తేజురాం,సీనియర్ నాయకులు అల్లాజీ గౌడ్,రచ్చ.శ్రీరాములు,మైసయ్య,ఎగిరిశెట్టి వీరయ్య,జంతుక జానయ్య, గంగ రవి గౌడ్,నిరంజన్ గౌడ్,పూసల సత్యం,జంతుక కిరణ్, వస్పుల శ్రీశైలం,కుమార్ గౌడ్,సతీష్ గౌడ్, బాలకృష్ణ గౌడ్,గుండ్రాతి నరేష్ గౌడ్,పట్నం రాఘవేందర్,వీరయ్య వడ్డే,విష్ణు,కృష్ణ,మహేష్,అశోక్, జిలీల్,తో పాటు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపనలో పాల్గొన్న.. సుంకిరెడ్డి

వెల్దండ మండలం బర్కత్‌పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్ చైర్మన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరై అమ్మవారి ప్రతిష్టాపన అనంతరం శ్రీ పెద్దమ్మ తల్లిని దర్శించుకుని పూజ కార్యక్రమంలో పాల్గొని,తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని,గ్రామంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.అనంతరం సుంకిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ అమ్మవారి ఆశీస్సులతో గొప్ప స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పర్వతాలు,ఉప సర్పంచ్ నరసింహ,సీనియర్ నాయకులు బొజ్జయ్య, అల్లాజీ,కొండల్, లింగం,మల్లేష్,శ్రీశైలం,ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రాజు, జంగయ్య,కొండల్ యాదవ్,చంద్ర శేఖర్ ఆలయ నిర్వాహకులు,గ్రామ పెద్దలు,యువత,తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెర్కూర్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీల వితరణ

వెల్దండ ఆగస్టు 31: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు కుర్చీలను సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు  సలహా మేరకు  అదే గ్రామంలో చెందిన రైతు మండేగుత్తల శశిధర్  అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం దాతకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు మైసయ్య,భీమయ్య గౌడ్, అల్లె సందీప్, చంద్రమౌళి రామచంద్రయ్య పాఠశాల ఉపాధ్యాయురాలు, లింగయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

డిసిసి డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా విజయ్ కుమార్

కల్వకుర్తి ఆగస్టు 31: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన డా. ఎం. విజయ్‌కుమార్ ను జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నియామక ఉత్తర్వులను డా. హరికాంత్ రెడ్డి జనరల్ సెక్రటరీ, టీపీసీసీ డాక్టర్ సెల్,తెలంగాణ  ఇన్‌చార్జ్ డా. దిలీప్ రెడ్డి, చైర్మన్, డాక్టర్ సెల్, నాగర్‌కర్నూల్ జిల్లా జారీ చేశారు.ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించినందుకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి,మరియు డిసిసి అధ్యక్షులు డా. వంశీకృష్ణలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.అలాగే తన నియామకానికి సహకరించిన టిపిసిసి డాక్టర్ సెల్ నాయకత్వానికి, జిల్లా కాంగ్రెస్ నాయకులకు మరియు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధత, నిజాయితీ, అంకితభావంతో నిర్వర్తిస్తూ, నాగర్‌కర్నూల్ జిల్లాలో డాక్టర్ సెల్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది మరియు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని తెలిపారు.

వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం

వెల్దండ మండల పరిధిలోని బర్కత్ పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆదివారం వెల్దండ మండల మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో అభినందించి  సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

కల్వకుర్తిలో 2 కే రన్ పోటీలు ప్రారంభిచిన ఎమ్మెల్యే కసిరెడ్డి

* నాగర్‌ కర్నూల్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలబాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న క్రీడా కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో బాలురు, బాలికల కోసం మొదటి 2కే రన్ క్రీడా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరై, 2కే రన్ క్రీడా పోటీలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చిన్నారులు, యువ క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.అనంతరం పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే  బహుమతులు అందజేసి అభినందించారు.గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని  సూచించారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, కల్వకుర్తి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం,కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్,పట్టణ మరియు మండల స్థాయి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు,క్రీడా సంఘం నిర్వాహకులు, కార్యకర్తలు, అభిమానులు, క్రీడాకారులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

పిల్లల సృజనాత్మకత శారీరక ఎదుగుదలపై అవగాహన

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29: కల్వకుర్తి మండలం లోని రాచాలపల్లి గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం వర్క్‌షాప్, అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 1, 2వ తరగతుల విద్యార్థులు, వారి తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు జ్ఞానాన్ని పెంపొందించడం, తల్లులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం, డ్రాయింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. 

రాష్ట్రపతి భవన్ రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఏకలవ్య విద్యార్థి

రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎ. వైష్ణవి పాల్గొన్నారు.భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పాఠశాలకు ఎంతో గర్వకారణమని ప్రిన్సిపాల్ సుమన్ కుమార్ తెలిపారు.

డిండి ఎత్తిపోతల పథకం అంశంపై సమీక్ష సమావేశం

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 27: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని ప్రజాప్రతినిధులతో అత్యవసర సమీక్షా సమావేశం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలోని చారగొండ మండలం పరిధిలోని గోకారం గ్రామ రైతుల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడటంతో పాటు,ఎర్రవల్లి గ్రామపంచాయతీ మరియు...