Category: తెలంగాణ

చందిప్పలో దొంగల బీభత్సం.. వృద్ధురాలిపై కత్తుల దాడి

శంకర్‌పల్లి, సెప్టెంబర్ 10: చందిప్పలో అర్ధరాత్రి నలుగురు దుండగులు ఇంట్లోకి చొరబడి దోపిడీకి యత్నించారు. వారిని గమనించి అడ్డుకున్న వృద్ధురాలిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలైన వృద్ధురాలిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా...

అర్ధరాత్రి చందిప్పలో దొంగల బీభత్సం

Source:U.Vamsi,Reporter,621109673 శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. దోపిడీకి యత్నించిన దుండగులు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో గ్రామంలో తీవ్ర కలకలం రేగింది. రాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నలుగురు గుర్తుతెలియని...

స్పీకర్ కు సంఘీభావం తెలిపిన..ఎమ్మెల్యే కసిరెడ్డి

కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ కు సంఘీభావం తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబును కలిసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు…

సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఖరీదైన వైద్యం.. గోలి శ్రీనివాస్ రెడ్డి

మాడ్గుల సెప్టెంబర్ 09: మాడ్గుల మండలం కుభ్యతాండ గ్రామపంచాయతీకి చెందిన నేనావత్ రాజ్యకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.60,000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఆపదలో ఉన్న పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,బీఆర్ఎస్ నాయకులు శ్రీను,లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.

కాళోజి జయంతిని జల సాధన దినంగా జరుపుకున్న.. జేఏసీ

వెల్దండ, సెప్టెంబర్ 09: చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్షలు 282 రోజులకు చేరాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ పిలుపు మేరకు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మంగళవారం వెల్దండ బస్టాండ్ ఆవరణలో జలసాధన దినాన్ని ఘనంగా జరుపుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల…

బండోనిపల్లిలో స్మార్ట్ కార్డులు రేషన్ కార్డుల పంపిణీ – లబ్ధిదారులలో ఆనందం

వెల్దండ, సెప్టెంబర్ 09 : వెల్దండ మండలంలోని బండోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ఎనుముల సంగీత – శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్వాల్ యాదవుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్,ఉప సర్పంచులుమాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ అందుతుందని, ప్రభుత్వ సంక్షేమ…

వెల్దండలో భక్తిశ్రద్ధలతో బోనాలు – బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలిన రాంనగర్ కాలనీ వాసులు

వెల్దండ, సెప్టెంబర్ 09: వెల్దండ మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి తరలివెళ్లారు. ప్రతి కుటుంబం బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాండ్ర గ్రామంలో శ్రీకృష్ణ హోమం – ఆధ్యాత్మిక భక్తి మార్గదర్శకతే జీవితానికి మార్గం.. మార్కెట్ చైర్మన్ సంజీవ్ యాదవ్

కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ హోమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికతే మనిషి జీవితానికి మార్గదర్శకమని,ఇలాంటి హోమాల వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అన్నారు.భగవంతుని ఆశీస్సులతోనే అభివృద్ధి సాధ్యమని, యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జియగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, భైరాపూర్ సర్పంచ్ రాజు యాదవ్,…

ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్య

ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జీఎఫ్) ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఈ నెల 10,11తేదీల్లో కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి అంబటి అంజయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అండర్-14-17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు…

సీపీఎం సీనియర్ నాయకుడు మృతి

సీపీఎం సీనియర్ నాయకుడు మృతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గడగోజు యాదయ్యచారి బుధవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయా పార్టీ నాయకులతో కలిసి వేర్వేరుగా మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…