ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

ప్రజావాణిలో వచ్చిన సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.
జ్ఞాన తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి, ఏప్రిల్: 29
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 18దరఖాస్తులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
