నకిలీ ఫోన్లు నకిలీ వాచీల విక్రయత అరెస్ట్
- సదర్ ఉత్సవానికి వేరే రామచంద్ర యాదవ్ కు ఆహ్వానం - November 7, 2026
- నకిలీ ఫోన్లు నకిలీ వాచీల విక్రయత అరెస్ట్ - November 7, 2026
- సున్నం చెరువు అభివృద్ధి పనుల పరిశీలన - November 7, 2026
నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీల విక్రయం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్, ఒరిజినల్ ఆపిల్ ఉత్పత్తులుగా నమ్మించి నకిలీ ఐఫోన్లు, ఆపిల్ వాచీలు, ఇయర్‌బడ్స్ విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 1267/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన అల్తమాష్ (26)ను నవంబర్ 7న అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు ఐఫోన్లు (ఒకటి నకిలీ), నాలుగు నకిలీ ఆపిల్/స్మార్ట్ వాచీలు, ఏడు నకిలీ ఇయర్‌బడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ మోసంలో మరో నిందితుడు ఆవేష్ ఖాన్ కూడా పాల్గొన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా, పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టయిన అల్తమాష్ను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ఏసీపీ మాదాపూర్ డివిజన్ మార్గదర్శకత్వంలో, రాయదుర్గం ఎస్హెచ్ఓ పర్యవేక్షణలో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె. రామిరెడ్డి, క్రైమ్ సిబ్బంది ఈ కేసును ఛేదించారు. పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.
