పేదింటి ఆడబిడ్డ వివాహానికి రూ.20 వేల ఆర్థిక సాయం
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026

వెల్దండ నవంబర్ 06: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన శ్రీను యాదవ్ కుమార్తె మేఘన వివాహ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు.ఆర్థిక ఇబ్బందులను గ్రామ బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వివాహ ఖర్చుల కోసం ఈ సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముక్తల శేఖర్, అజిలాపూర్ సర్పంచ్ సిద్ధమోని రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బాలకిష్టయ్య గౌడ్, బాలకృష్ణ, రామకృష్ణ, వెంకటయ్య గౌడ్, పారేష్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
