పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి: రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు – ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
- కల్వకుర్తి యాదవ సంఘం అధ్యక్షుడిగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్! - November 6, 2026
- కొట్ర తండా కూడలిలో పోలీసుల ముమ్మర వాహన తనిఖీలు - November 6, 2026
- ఎస్సీ సంక్షేమ పథకాల సాధనకు ర్యాలీ.. పోలీసులకు వినతి - November 6, 2026

వెల్దండ, నవంబర్ 06: పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వెల్దండ రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. గురువారం వెల్దండ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్‌కు పట్టభద్రుల ఓటు నమోదు దరఖాస్తులను ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి పట్టభద్రుడు బాధ్యతగా నమోదు ప్రక్రియలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో పూరి శివకుమార్, లక్ష్మయ్య, మట్ట విష్ణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
