కామారెడ్డి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతంపై కఠిన చర్యలు తీసుకోవాలి.

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పై అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ జీవియం విఠల్ డిమాండ్ చేశారు.వైద్య విద్యను అభ్యసించేందుకు కళాశాలల్లో చేరుతున్న విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యం, సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ర్యాగింగ్ పేరుతో విద్యార్థులను వేధించడం, మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదన్నారు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం మరియు కళాశాల యాజమాన్యం కఠిన చర్యలు చేపట్టాలని, బాధిత విద్యార్థులకు పూర్తి భద్రత కల్పించాలని కోరారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీని సమర్థవంతంగా పనిచేయించి, విద్యార్థులకు ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచి, వారికి ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా న్యాయం చేయాలని కోరారు.

AISA ప్రధాన డిమాండ్లు:

1. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి.

2. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు నిర్ధారణ అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

3. బాధిత విద్యార్థులకు రక్షణ, న్యాయం కల్పించాలి.

4. యాంటీ ర్యాగింగ్ కమిటీని బలోపేతం చేయాలి.

You may also like...