పట్టభద్రుల ఓటు పై కాంగ్రెస్ దృష్టి.. కాంగ్రెస్ కే పట్టం కట్టాలని హరికిషన్ పిలుపు

వెల్దండ నవంబర్ 04 : ఉమ్మడి మహబూబ్‌నగర్–రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సోమ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్దండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మూడవత్ హరికిషన్ నాయక్ పిలుపునిచ్చారు.బుధవారం వెల్దండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. యువత, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించేందుకు రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సర్పంచులు మొక్తాల రమేష్, అన్వర్ పాషా, మాజీ సర్పంచులు రామచంద్రారెడ్డి, పత్యా నాయక్, జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షుడు కొయ్యల పుల్లయ్య, యువ నాయకులు శ్రీను నాయక్, రమేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.1001327768.jpg

You may also like...