పోతేపల్లి పట్టభద్రుల ఓటర్ల నమోదు.. తహసీల్దార్‌కు దరఖాస్తుల అందజేత

1001325022.jpg

వెల్దండ: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను బీఆర్ఎస్ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి పోతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పట్టభద్రుల ఓటర్ల వివరాలను నమోదు చేసి, సంబంధిత దరఖాస్తులను మంగళవారం వెల్దండ తహసీల్దార్‌ బీశ్వ కార్తీక్ కుమార్ కు అందజేశారు.మండల బీఆర్ఎస్ యువ నాయకులు అంజి మాస్టర్,పోతేపల్లి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జి మంగళపల్లి వెంకటయ్య ఆధ్వర్యంలో, పోతేపల్లి ఉపసర్పంచ్ శారదా బాలయ్య గౌడ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బీఎల్ఓ శ్రీనివాసులు,బీఆర్ఎస్ నాయకులు జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీలు హనుమంతు నాయక్,వార్డు సభ్యుడు గోరటి అశోక్ కుమార్,జంగిలి ఆనంద్, మాజీ సర్పంచ్ ప్రభాకర్, బోయినపల్లి రవి గౌడ్,తాండ్ర శ్రీను, జోగు రవి, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...