ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం
- వర్షాల వేల ప్రజల కోసం సేవ ముందస్తు చర్యలు - September 22, 2026
- ఎల్ నినో ప్రభావం పై అవగాహన లేకుండా బీఆర్ఎస్ నేతలు ధర్నాలు – మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత నరసింహాం - September 22, 2026
- మృతుని కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక చేయూత - September 22, 2026
ఆమనగల్: ప్రకృతి వైపరీత్యాలు, ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడిందనే కనీస అవగాహన లేకుండా బీఆర్‌ఎస్ నాయకులు విద్యుత్ సమస్యపై ధర్నాలు చేయడం హాస్యాస్పదమని ఆమనగల్ మార్కెట్ చైర్‌పర్సన్ యాట గీతా నరసింహం విమర్శించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొన్న విద్యుత్ సమస్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని గత పాలకులు ఇప్పుడు ధర్నాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యుత్ కొరతకు దారితీసిన ప్రకృతి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ విమర్శలు, ధర్నాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరించాలని యాట గీతా నరసింహం కోరారు.
