బ్రహ్మంగారి కాలనీలోని గణనాథుని ప్రత్యేక పూజలు పాల్గొన్న సింగిరెడ్డి

1001202201.jpg

కడ్తాల్: కడ్తాల్ పట్టణంలోని బ్రహ్మగారి కాలనీలో టీమ్ బీజీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం టీమ్ బీగీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులు, కాలనీ వాసులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దాత గూడూరు జంగారెడ్డిని అభినందించిన రాఘవేందర్ రెడ్డి, గణనాథుడి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ఆహ్వానించిన టీమ్ బీజీసి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ సర్పంచ్ ఎల్.ఎన్. రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు బావాండ్ల ఆనంద్, జోగు వీరయ్య, మాజీ ఉప సర్పంచ్ కాడారి రామకృష్ణ, మాజీ సర్పంచ్ రచ్చ శ్రీరాములు, వార్డు సభ్యులు ఎర్రోళ్ల రాఘవేందర్, దుడ్డు పుల్లమ్మ మల్లయ్య, నాగరాజు, టీమ్ బీగీసి సభ్యులు రమేష్, గణేష్, శేఖర్, విగ్నేష్, తల్లోజు రఘు, ఎగిరిశెట్టి లింగం, కాలనీ వాసులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...