విద్యుత్ కోతలపై భగ్గుమన్న బీఆర్ఎస్.. రావిచెడు సబ్ స్టేషన్ ముందు మెరుపు ధర్నా
- జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు - September 22, 2026
- తలకొండపల్లి లో గ్యాస్ సిలిండర్ల కొరత .! - September 22, 2026
- ఘనంగా పాండు నాయక్ జన్మదిన వేడుకలు - September 22, 2026

కల్వకుర్తి: విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రావిచెడు విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి మెరుపు ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌తో కలిసి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆందోళనలో పాల్గొన్నారు.రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
