ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం.. ఎమ్మెల్యే
- వినాయకుని సన్నిధిలో ప్రత్యేక పూజలు -గోలి శ్రీనివాస్ రెడ్డి - September 21, 2026
- పేద కుటుంబానికి సీఎం సహాయనిది అండ – 60 వేల చెక్కు అందజేత - September 21, 2026
- వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు – సిఐ రవీందర్ రెడ్డి - September 21, 2026

వెల్దండ: ఆయుర్వేద వైద్యం మన ప్రాచీన వైద్య విధానమని, సహజ పద్ధతుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వెల్దండ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక వైద్యంతో పాటు ఆయుర్వేద చికిత్సను కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు ఆయుర్వేద వైద్య పరీక్షలు, చికిత్సలు అందించడం అభినందనీయమన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా, ఆయుర్వేదం ఎంతో దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వైద్య సిబ్బంది, యోగా శిక్షకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
