పోతేపల్లి గణేష్ ఉత్సవాలకు సర్పంచ్ కొండలు యాదవ్ రూ.10 వేల విరాళం

1001198837.jpg

వెల్దండ: పోతేపల్లి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని గ్రామ సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ సందర్శించారు. మండప నిర్వాహకులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులతో ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తనవంతు సహకారంగా రూ.10 వేల విరాళాన్ని మండప నిర్వాహకులకు అందజేశారు. గ్రామంలో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలను ప్రజలంతా ఐక్యతతో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు సర్పంచ్ కొండల్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎనుముల లట్టు యాదవ్, మల్లేష్ యాదవ్, ప్రశాంతి యాదవ్, గన్నోజి శ్రీహరి, జగదీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...