వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026
వెల్దండ, సెప్టెంబర్ 19: వెల్దండ మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను శనివారం సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. దీంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గి స్థానికులకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, విద్యుత్ ఏఈ వెంకటేశ్వర్లు గౌడ్, లైన్మెన్ లక్ష్మణ్ నాయక్, వార్డు సభ్యులు ముదిగొండ రమేష్, పిల్లి దేవేందర్, సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, కాసారపు వెంకటయ్య, మంగళగిరి శ్రీను, విద్యుత్ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

