కుంచి మూట
మేము తినేటివి
అమ్మమ్మ కొనేటివి
కుంచి మూటలో ఉండేవి
అమ్మమ్మ చేతిలో అక్షయపాత్ర లాంటిది ఈ కుంచి
తాత అంచు పంచుతో
అమ్మమ్మ పాత చీర దారం కుచ్చుల కంచతో
విడదీయని బంధంతో
పెనవేసుకొనెను ప్రేమతో
రెండు తనువుల మమేకంతో
వారి బట్టల బంధం కలయికతో
పుట్టెను పూర్వమే కుంచి అనే పేరుతో
పూర్వం ధాన్యం కొలిచెను కుంచితో
ఎండ వానలకు గొడుగై నిలిచెను ఈ కుంచి
చలికాలంలో వేడి కొలిమి ఈ కుంచి
ఏ ప్రయాణంలోనైనా అమ్మమ్మ భుజమున నిలిచెను ఈ
కుంచి
అమ్మమ్మ పాత చీరల గోనెసంచి ఈ కుంచి
అమ్మమ్మ ఆకుల సంచికి అక్కై నిలిచెను ఈ కుంచి
నేడు హ్యాండ్ బ్యాగుగా అవతారమెత్తెను ఈ కుంచి
నేడైనా నాడైనా ఆడవారి భుజం పైనే ఈ కుంచి
