గణేశుడి చిత్రంతో చికెన్ బిర్యానీ ప్రకటన.. యజమాని అరెస్ట్
- హయత్‌నగర్ సమీపంలో ఘోర ప్రమాదం - September 15, 2026
- సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన - September 15, 2026
- తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం భేటీ - September 15, 2026

వినాయక చవితి పర్వదినాన్ని వ్యాపార ప్రచారానికి వివాదాస్పదంగా ఉపయోగించడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చికెన్ బిర్యానీ ఆఫర్ కోసం ఏర్పాటు చేసిన బ్యానర్‌లో గణేశుడి చిత్రాన్ని ఉపయోగించడంతో మత మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి బ్యానర్‌ను తొలగించడంతో పాటు బిర్యానీ షాపు యజమాని జయంత్ (30)ను అరెస్ట్ చేశారు.తిరునల్వేలి-తిరుచెందూర్ ప్రధాన రహదారిలోని వీఎం ఛత్రం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ బ్యానర్‌లో సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రూ.99కే ‘అరబిక్ స్టైల్ చికెన్ 65 బిర్యానీ’ అందిస్తున్నట్లు ప్రచారం చేశారు. అయితే గణేశుడు బిర్యానీ వండుతున్నట్లు లేదా తింటున్నట్లుగా చిత్రాన్ని ముద్రించడం వివాదానికి కేంద్రంగా మారింది.బ్యానర్‌ను చూసిన స్థానికులు, హిందూ మున్నాని సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మత విశ్వాసాలను కించపరిచేలా దేవుడి చిత్రాన్ని ఆహార ప్రకటనకు ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షాపు వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బ్యానర్‌ను తొలగించి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై సెల్వరాజ్ (42) తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం షాపు యజమాని జయంత్‌ను అరెస్ట్ చేశారు. పండుగను వ్యాపార ప్రయోజనాలకు వాడుకోవడమే కాకుండా, మతపరమైన ప్రతీకలను వివాదాస్పదంగా ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
