వినాయక చవితి రోజు కూడా ఆగని సేవ – సుంకిరెడ్డి కంటి శిబిరానికి పోటెత్తిన జనం

కడ్తాల్ సెప్టెంబర్ 14: కడ్తాల్ ఎంబీఏ గార్డెన్స్ లో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో, శంకర నేత్రాలయ చెన్నై వారిచే నిర్వహిస్తున్న 6వ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం 4వ రోజు కూడా నిరంతరాయంగా కొనసాగింది.వినాయక చవితి పండుగ రోజున కూడా శిబిరానికి సెలవు లేకుండా వైద్య సేవలు కొనసాగడంతో కడ్తాల్ మండలం, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు రోజులలో మొత్తం 3,040 మంది సందర్శించగా 1,950+ ఉచిత కంటి పరీక్షలు, 1,170+ ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేసి,117 మంది శుక్లాల ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.4వ రోజు 840 సందర్శించారని,530 పరీక్షలు, 380 కళ్లద్దాలు, 31 మంది ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు.సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులతో కంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న వారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతోందని,రేపటి నుండి సెప్టెంబర్ 15-19 వరకు ఉచిత శుక్లాల ఆపరేషన్లు విడతల వారీగా నిర్వహిస్తామని, సెప్టెంబర్ 16 వరకు ఉచిత పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తల్లోజు రఘు, ఎగిరిశెట్టి లింగం, రచ్చ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

You may also like...