విద్యుత్ షాక్ బాధితుడికి భాస్కర్ రావు భరోసా – రూ. 20 వేల ఆర్థిక సాయం

వెల్దండ సెప్టెంబర్ 14: వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు గారు మానవత్వం చాటుకున్నారు.చెదురుపల్లి గ్రామానికి చెందిన పోలే శ్రీరాములు 15 రోజుల క్రితం విద్యుత్ షాక్ కు గురై కల్వకుర్తి మహిత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ రావు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, చెదురుపల్లి సర్పంచ్ దన్సింగ్ నాయక్ పాల్గొన్నారు.పేద కుటుంబానికి అండగా నిలిచిన భాస్కర్ రావును గ్రామస్తులు,బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...