ఎమ్మెల్యే సహకారంతో బొల్లంపల్లిలో విద్యుత్ ప్రమాద ముప్పు తొలగింపు

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 13: వెల్దండ మండలం బొల్లంపల్లి గ్రామంలో గృహాలపై ఉన్న విద్యుత్ తీగల వల్ల ఏళ్లుగా ప్రజలు ప్రమాద భయంతో ఉండేవారు.కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి, గృహాలపై ఉన్న ప్రమాదకర విద్యుత్ తీగలన్నింటినీ తొలగించి,దారి మళ్లించారు. దీంతో ప్రజలకు విద్యుత్ ప్రమాద ముప్పు తప్పినట్లయింది.సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,సర్పంచ్ ప్రసాద్ గౌడ్ లకు గ్రామస్తులు రామకృష్ణ, అంజయ్య, వెంకటయ్య, పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...