తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

తలకొండపల్లి,సెప్టెంబర్ తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సమక్షంలో భారీ చేరికలు..పూల్సింగ్ తండా స్వతంత్ర సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, ఉప సర్పంచ్ జర్పుల సురేష్ నాయక్, పాలక మండలి సభ్యులు, పడమటి తండా ఉప సర్పంచ్ రాత్లావత్ కిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సమక్షంలో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ చేరికలను వీరన్నపల్లి సర్పంచ్ రామ్ లక్ష్మణ్ యాదవ్, ఉప సర్పంచ్ రాఘవేందర్ యాదవ్,మెదక్‌పల్లి సర్పంచ్ రమేష్, రాజేందర్ నాయక్ సమన్వయం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతోందని,మండలంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అన్నారు.కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ అధ్యక్షుడు యాట నర్సింహ ముదిరాజ్, రఘురాములు, రేణు రెడ్డి, నర్సింహ రెడ్డి, యాదయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు శివ తదితరులు పాల్గొన్నారు.

You may also like...