జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం
- సంజయ్‌నగర్ నూతన మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి ; మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ - September 13, 2026
- జనగామలో మానవత్వం చాటిన ట్రాఫిక్ పోలీసులు - September 13, 2026
- జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం - September 13, 2026
జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య శిబిరానికి మున్సిపాలిటీలోని మొత్తం 183 మంది సిబ్బందికి గాను 163 మంది సిబ్బంది హాజరయ్యారు. హాజరైన సిబ్బందికి సమగ్ర హెల్త్ చెకప్ నిర్వహించడంతో పాటు అవసరమైన రక్త నమూనాలు మరియు ఇతర వైద్య పరీక్షల కోసం నమూనాలు సేకరించడం జరిగింది.మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి శ్రీనివాస్ గారు, మున్సిపల్ కమిషనర్ శ్రీ చిమ్ముల రాజశేఖర్ రెడ్డి గారు, మెడికల్ ఆఫీసర్ డా. అనురాధ జాదవ్ గారు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీ గోపయ్య గారు, జవాన్లు, వార్డు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
