వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్
- కాంగ్రెస్ తీరుపై చిరుమర్తి లింగయ్య ధ్వజం - September 11, 2026
- మంచినీటి సమస్యల తలెత్తకుండా చర్యలు : సర్పంచ్ ముక్కామల శ్యామల - September 11, 2026
- కట్టంగూర్ ఎంఈఓగా మైనం శ్రీలత బాధ్యతల స్వీకరణ - September 11, 2026
వీబీజీ రామ్ జీపై అవగాహన కల్పించాలి : మండల ప్రత్యేక అధికారి సతీష్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 11 : వీబీజీ రామ్ జీ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని మండల ప్రత్యేక అధికారి సతీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండలస్థాయిలో నిర్వహించిన అవగాహన, ప్రణాళికల తయారీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమం లక్ష్యాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రణాళికలు సిద్దం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీడీఓ అంజన్ రెడ్డి, తాసీల్దార్ పుష్పలత, ఎంపీఓ స్వరూపారాణి, ఏపీఓ కడెం రాంమోహన్, వివిధ గ్రామాల సర్పంచుల్ లు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
