వివాహ వార్షికోత్సవ వేడుకలకు సేవా స్ఫూర్తి
- గడ్డం వెంకటస్వామి ఆశయాలకు ఘన నివాళి - October 5, 2026
- మహాలక్ష్మికి పెరుగుతున్న ఆదరణ..3 నెలల్లో 97.20 లక్షల అదనపు ప్రయాణాలు - October 5, 2026
- ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ మూడు డిమాండ్లు - October 5, 2026

శంకర్‌పల్లి అగ్రికల్చరల్ మార్కెటింగ్ చైర్మన్ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి కుమారుడు చేకూర్త మధుకర్‌రెడ్డి, చేకూర్త నిఖిలారెడ్డి దంపతుల మొదటి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహాలింగాపురం జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు.
విద్యార్థి విద్యార్థినులకు పుస్తకాలు, డిక్షనరీలు, బ్లాక్‌బోర్డులు, అట్లాస్‌లు అందజేసి విద్యా ప్రగతికి అండగా నిలిచారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సీతాలక్ష్మి ఉపాధ్యాయులు అంజయ్య, శ్రీరాములు, మల్లికార్జున స్వామి, రమ, అనుపమ, గీతాంజలి, పల్లవి తదితరులు పాల్గొన్నారు.



