శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

శంకర్‌పల్లి: శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం 6:30 గంటలకు ముందు రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రుడిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు వివరాలు లభించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు, బంధువుల ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మృతుడిని గుర్తించిన వారు లేదా అతడి కుటుంబ సభ్యుల గురించి సమాచారం తెలిసిన వారు GRP వికారాబాద్ పోలీసులను 7702629707 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

You may also like...