బీఎస్పీలోకి మ్యాతరీ సంజీవులు.. ఎల్లారెడ్డి ఇంచార్జీగా బాధ్యతలు
- సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు - October 6, 2026
- టొరంటో వర్సిటీ భారీ స్కాలర్షిప్ - October 6, 2026
- విశాఖలో సముద్ర రక్షణకు మరింత బలం - October 6, 2026

జ్ఞానతెలంగాణ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం పేట్ సంగెంకు చెందిన మ్యాతరీ సంజీవులు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్‌ను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బీఎస్పీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన సంజీవులు తన మిత్రులతో కలిసి పార్టీలో చేరారు. అనంతరం పార్టీ అధిష్ఠానం సంజీవులకు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించింది. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ అధిష్ఠానం సూచనలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఎస్పీని నియోజకవర్గంలో మరింత బలోపేతం చేస్తానని సంజీవులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఇంచార్జీ కాన్షీరామ్ పాల్గొన్నారు.

