ఘనంగా యువనేత శ్రీనివాస్ జన్మదిన వేడుకలు
- సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు - August 11, 2026
- ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి - August 11, 2026
- సాన్జోస్లో క్వాంటమ్స్కేప్ సీఈఓతో భేటీ - August 11, 2026

జ్ఞాన తెలంగాణ, నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 10 : వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నేత జంగిలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జంగిలి నిరంజన్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. శ్రీనివాస్ పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటూ, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని,ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్,మాజీ ఎంపీటీసీ లింగం, గుద్దేటి ప్రభాకర్,బెంచి అంజయ్య, యువ నాయకులు అంజి మాస్టర్, జంగిలి ఆనంద్,సత్యం,ప్రవీణ్, అశోక్ కుమార్, యాదగిరి, మట్ట శ్రీను,ఏకుల శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
