మేకగూడలో యూత్ కాంగ్రెస్ జోష్
- ఫేతేపూర్ ఫ్లైఓవర్‌పై భద్రత ఎక్కడ..? - September 24, 2026
- రెండు డీఏలకు ప్రభుత్వం ఓకే - September 24, 2026
- తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు - September 23, 2026

జ్ఞాన తెలంగాణ, నందిగామ ప్రతినిధి | ఆగస్టు 09: మేకగూడ గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయికిరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికిరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తల సేవలను ఆయన కొనియాడారు. యువత సమాజ వికాసంలో ముందుండాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలిపారు. యువత సంక్షేమం, గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని సాయికిరణ్‌రెడ్డి స్పష్టం చేశారు. మేకగూడలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకలు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి.
