మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
- మృతుడి కుటుంబానికి ఉప్పల ట్రస్ట్ ఆర్థిక సహాయం - August 10, 2026
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026

జ్ఞాన తెలంగాణ, తలకొండపల్లి ప్రతినిధి | ఆగస్టు 09: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం లింగరావుపల్లి గ్రామానికి చెందిన టేకురి చంద్రయ్య అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లింగరావుపల్లి గ్రామ సర్పంచ్ కాసు శ్రీనివాస్‌రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు.
చంద్రయ్య మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాసు శ్రీనివాస్‌రెడ్డి.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మృతుని పెద్ద కుమారుడు నర్సింహకు తనవంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
అదేవిధంగా గ్రామ ఉప సర్పంచ్ భూత్కూరి వెంకట్‌రెడ్డి మృతుని కుటుంబానికి రూ.2 వేల ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి తోడుగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. మృతుని కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ పెద్ద బాల్‌రెడ్డి, ఉప సర్పంచ్ భూత్కూరి వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు బొచ్చుపల్లి శేఖర్, టేకురి శివలింగం, టేకురి సుమన్, గ్రామ నాయకులు బొచ్చుపల్లి రాములు, చంద్రయ్య, వెంకటయ్య, కిష్టయ్య, రాజేష్, రబ్బానీ రాములు, నర్సింహా, శ్రీకాంత్‌కుమార్ తదితరులు పాల్గొని మృతునికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.
