నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు
- “విజయం ఒక్కరోజులో రాదు.. పట్టుదలతో సాగిన ప్రతి అడుగూ విజయానికి పునాది.” - September 22, 2026
- స్వర్ణ సంచలనం..లంకపై భారత్ ఘన విజయం! - September 22, 2026
- రిమ్స్ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం - September 22, 2026

విదేశీ పర్యటన ముగించుకుని నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి చేరుకోనున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం పలకాలని మోకిలా గ్రామ సర్పంచ్ చిట్టెంపల్లి శేఖర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే స్వాగత కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం పలకాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కాంగ్రెస్ శ్రేణులంతా ఐక్యంగా స్వాగతం పలికి పార్టీ బలాన్ని చాటాలని చిట్టెంపల్లి శేఖర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
