విద్యార్థి ఉన్నత చదువులకు దాతల సాయం
- చేవెళ్ల బీసీ హాస్టల్లో అన్నంలో పురుగులు - August 7, 2026
- రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు - August 7, 2026
- రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య - August 7, 2026

జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 07:
కల్వకుర్తి నియోజకవర్గం చారగొండ మండలం గోకారం గ్రామానికి చెందిన బాధగోని కమల్ గౌడ్ (తండ్రి జంగయ్య) బీటెక్ చదువుతున్న విద్యార్థి ఉన్నత చదువులకు దాతలు రూ.60 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు రూ. 30 వేలు, చారగొండ సర్పంచ్ గుండె విజయేందర్ గౌడ్ రూ.20 వేలు,మాజీ ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి రూ.10 వేల రూపాయలు ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం చేశారు.విద్యాభ్యాసానికి తోడ్పాటుగా నిలిచి సహాయం అందించడం అభినందనీయమని, విద్యార్థి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దాతలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల ఆంజనేయులు, గోకారం సాయి, ఎర్రవల్లి మాజీ సర్పంచ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
