తిరుమలలో భక్తుల భారీ రద్దీ

- ఒక్కరోజులో 82 వేల మందికి పైగా దర్శనం
- హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లు
- 31 వేల మంది తలనీలాలు సమర్పణ
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండింది
- సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ
జ్ఞానతెలంగాణ,డెస్క్ :
తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద వారాంతం కావడంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శనివారం (మార్చి 28) ఒక్కరోజే 82,040 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.18 కోట్లకు చేరింది. అలాగే 31,606 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. అధికారులు భక్తులు సహనంతో ఉండాలని సూచిస్తున్నారు.
