Daily Archive: September 10, 2026
వెల్దండ, సెప్టెంబర్ 09: వెల్దండ మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి తరలివెళ్లారు. ప్రతి కుటుంబం బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ హోమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికతే మనిషి జీవితానికి మార్గదర్శకమని,ఇలాంటి హోమాల వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అన్నారు.భగవంతుని ఆశీస్సులతోనే అభివృద్ధి సాధ్యమని, యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జియగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, భైరాపూర్ సర్పంచ్ రాజు యాదవ్,…
ఈ నెల 10,11న మండల స్థాయి ఎస్ జీఎఫ్ క్రీడలు : ఎంఈఓ అంజయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్ జీఎఫ్) ఆధ్వర్యంలో మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీలు ఈ నెల 10,11తేదీల్లో కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి అంబటి అంజయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అండర్-14-17 విభాగాల్లో బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు…
సీపీఎం సీనియర్ నాయకుడు మృతిజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9 : మండలంలోని చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గడగోజు యాదయ్యచారి బుధవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆయా పార్టీ నాయకులతో కలిసి వేర్వేరుగా మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి వెంట సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు…
రేవంత్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు విఫలం: కేసీఆర్ ఇంటి ముట్టడికి పోలీసులే రూట్‌మ్యాప్ ఇవ్వడం దారుణం..సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలినకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 9 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇంటిని ముట్టడించి చావు డప్పు కొడతామని కొందరు ప్రకటిస్తే.. పోలీసు యంత్రాంగం వారికి రూట్‌మ్యాప్ ఇచ్చి తీసుకెళ్లడం ఏమిటని ప్రశ్నించారు….
వెల్దండ సెప్టెంబర్ 09: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో గల ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో హిందీ గేయం, తెలుగు జానపద గేయం విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించి వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. విజేతలకు వేదికపై బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విజయం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ప్రిన్సిపల్ సుమన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్…
వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలు భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. గ్రామంలో నీ ఆడపడుచులు బోనం నేత్తిన ఎత్తుకునీ ఊరంతా డప్పు దరువులు డి జే మోతలతో ఊరేగింపు గా వెల్లి బోనాలను అమ్మా వారికి సమర్పించడం జరింగింది. ఈ ఉత్సవంలో గ్రామ సర్పంచ్ మహ్మద్ అన్వర్ ఫాషా గారు ఉప సర్పంచ్ జోగు రాములమ్మ లింగమయ్య గారు వార్డు సభ్యులు నేతలు కుపిరెడ్డి అశోక్ రెడ్డి గారు, మల్లెపాకుల శేఖర్,పబ్బు…