340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్ సమావేశం
- సర్కారీ బడుల్లో విస్తృత తనిఖీలు - August 11, 2026
- ఆర్ఎంపీ వైద్యం వికటించి బాలిక మృతి - August 11, 2026
- సాన్జోస్లో క్వాంటమ్స్కేప్ సీఈఓతో భేటీ - August 11, 2026

Siasat.Com
340 అద్దె బస్సులకు టెండర్లు.. 28న ప్రీ బిడ్ సమావేశం
గ్రేటర్ జోన్‌లో 340 అద్దె బస్సులకు టీఎస్ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది. అద్దె ప్రాతిపదికన హైదరాబాద్ రీజియన్‌లో 162, సికింద్రాబాద్ రీజియన్‌లో 178 బస్సులు వివిధ రూట్లలో నడిపేందుకు ఔత్సహికులైన పారిశ్రామిక వేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. టెండర్ల దాఖలు, నియమ నిబంధనలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత అధికారులతో జూబ్లీబస్ స్టేషన్ రెండో అంతస్తులో ఉదయం 11 గంటలకు ఈ నెల 28న ప్రీ బిడ్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు www.tsrtc.telangana.gov.in వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు తెలిపారు.. కేపీ
