శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం
శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపై మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి దూసుకెళ్లింది.
సమాచారం ప్రకారం, ముందుగా వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బొలెరో ఒక్కసారిగా స్కిడ్ అయి బస్ స్టాప్ వైపు దూసుకెళ్లడంతో అక్కడ నిలబడి ఉన్న ముగ్గురు మహిళలు వాహనం కింద నలిగిపోయారు. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ఆర్జీఐఏ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

