అదనపు జలాల అనుసంధానం పూర్తి చేయాలి ఎండి అశోక్ రెడ్డి ఆదేశం
నవంబర్ 15లోగా గోదావరి అదనపు జలాల అనుసంధాన పనులు పూర్తి చేయాలి జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశం హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి అదనపు జలాలను నగరానికి తరలించే పనులను వేగవంతం చేయాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో సింగూరు–మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రోజుకు 40 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ)…
