ఇందిరమ్మ ఇంట్లో తొలి దీపావళి సంబరాలు లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ చింతలగట్టు శివరాజ్

Iసంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ సొంతింట్లో తొలి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి వారి ఇళ్ల ముందు దీపాలు వెలిగించి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. సొంతింటి కల సాకారం కావడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. తమ సొంతింట్లో తొలి దీపావళి జరుపుకోవడం…