నా గోల్డెన్ ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు

shrikanth nallolla

ప్రాధమిక పాఠశాలలో
కొందరితో ఏర్పడిన స్నేహం
ప్రాణ శ్వాసై
ఇప్పటికీ జీవిస్తూనే ఉంది !
ఉన్నత పాఠశాలలో
మరికొంతమందితో
జత కలిసిన స్నేహం
నిత్య చలనమై
ఇప్పటికీ చరిస్తూనే ఉంది !
ఇంటర్మీడియట్ లో
మరికొందరితో
కుదిరిన స్నేహం
నేటికీ హృదయంలో
కుదురుగానే ఉంది !
గ్రాడ్యుయేషన్ లో
ఇంకొందరితో
అమరిన స్నేహం
నేటికీ ఆప్యాయంగా
పలకరిస్తూనే ఉంది !
మంచి స్నేహితుల ద్వారా
మరికొందరితో ఏర్పడిన
పరిచయం స్నేహమై
నేటికీ పులకరిస్తూనే ఉంది!
స్నేహమే కదా
వ్యక్తిత్వానికి పునాది
స్నేహమే కదా
భవిష్యత్ గమనానికి
రూపశిల్పి !
ఎన్నెన్ని కబుర్లు
ఎన్నెన్ని కేరింతలు !
ఆటలు
పోట్లాటలు
అలకలు
గిల్లికజ్జాలు
చర్చలు
షికార్లు
కంట తడిగా ప్రవహిస్తూనే ఉన్నాయి
గుండె తడిగా మిగిలే ఉన్నాయి !

నేడు
బతుకు పోరాటంలో
ఎవరెక్కడున్నా
హృదయ కవాటాల్లో
ధ్వనిస్తూనే ఉన్నాం !


పి.లక్ష్మణ్ రావ్
విజయనగరం
9441215989

You may also like...