పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి: పగడాల సైదులు మహారాజ్

1001331436.jpg

వెల్దండ నవంబర్ 05: వెల్దండ మండలంలోని పట్టభద్రులంతా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని మాదిగ జాగృతి మండల సంఘం అధ్యక్షులు పగడాల సైదులు మహారాజ్ అన్నారు.గురువారం ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు పత్రాన్ని వెల్దండ తహసిల్దార్ కార్తీక్ కుమార్ కు అందజేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని, ప్రతి పట్టభద్రుడు తప్పకుండా దరఖాస్తు చేసుకుని తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గడువు ముగిసేలోపు ఎవరూ మిగిలిపోకుండా అందరూ నమోదు చేసుకోవాలని కోరారు.

You may also like...