వెల్దండ పీఏసీఎస్‌కు కొత్త పాలకవర్గం..చైర్మన్‌గా ఎన్నం భూపతిరెడ్డి నియామకం
- వెల్దండ పీఏసీఎస్‌కు కొత్త పాలకవర్గం..చైర్మన్‌గా ఎన్నం భూపతిరెడ్డి నియామకం - November 5, 2026
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026
- కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్‌గా పూరం హరీశ్వర్ రెడ్డి - November 4, 2026

వెల్దండ,నవంబర్ 04: వెల్దండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాత పాలకవర్గాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిట్ లోపాలు, రూ.1.08 కోట్ల బకాయిలు, రూ.94 లక్షల చెల్లింపులు పెండింగ్‌లో ఉండటం, రూ.15.40 లక్షల రుణమాఫీ నిధులు జమ కాకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.కొత్త పాలకవర్గం చైర్మన్‌గా ఎన్నం భూపతిరెడ్డి నియమితులయ్యారు. సభ్యులుగా బానావత్ శంకర్ నాయక్, పెద్ది రామకృష్ణ, కల్వ యాదమ్మ,ఎస్. కలమ్మ, కె. పుల్లయ్య, రమేష్ యాదవ్, రత్లావత్ లాలు నాయక్, చల్లా వెంకట్ రెడ్డి, గంగదరి మల్లేష్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, కాయితి శ్రీనివాస్ రెడ్డి, పవన్ నాయక్ నియమితులయ్యారు. ఈ పాలకవర్గం ఆరు నెలల పాటు లేదా నూతన ఎన్నికలు జరిగే వరకు కొనసాగనుంది.
