కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి
- కల్వకుర్తిలో గులాబీ జెండాకు సారథి ఎవరు?..టికెట్ రేసులో దూసుకుపోతున్న గోలి శ్రీనివాస్ రెడ్డి - November 4, 2026
- కల్వకుర్తి సహకార సంఘం నూతన చైర్మన్గా పూరం హరీశ్వర్ రెడ్డి - November 4, 2026
- పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి - November 4, 2026

కల్వకుర్తి నవంబర్ 04 :కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ రేసులో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ముందంజలో ఉన్నారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది.నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు, జనాదరణ ఉంది.తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ,పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.నియోజకవర్గ స్థాయిలో ఏ కార్యకర్తకు ఏ ఆపద ఎదురైనా తక్షణమే వారి ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించడం గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకత.నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి ప్రతి మండలంలోని కార్యకర్తలను, నాయకులను,అభిమానులను ఆత్మీయంగా పలకరించి వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు.ప్రజా సమస్యలపై ఎదురొడ్డి నిలబడడం,రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిరంతరం పోరాటం చేయడం ఆయన నిబద్ధతకు,పట్టుదలకు నిదర్శనం.కార్యకర్తలు, అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుని పేదల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.అందుకే బీఆర్ఎస్ అధిష్టానం గోలి శ్రీనివాస్ రెడ్డికి టికెట్ కేటాయిస్తే, కల్వకుర్తి గడ్డపై గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ కు కానుకగా ఇస్తారని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
