అవురుపల్లి భూముల ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు

1001327658.jpg

వెల్దండ నవంబర్ 04 :మాడ్గుల మండలం అవురుపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 123లో తమకు సంబంధించిన భూములను పక్క పొలాల వారు అక్రమంగా ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు మాడ్గుల డిప్యూటీ తహసీల్దార్‌ నాయీబ్‌కు వినతిపత్రం అందజేశారు.కలకొండ రాములు, దండు పెద్ద రాములు,దార్ల లింగయ్య,ఒగ్గు జంగమ్మ, ముత్యాల నర్సమ్మ, బావండ్లపల్లి మల్లమ్మలకు చెందిన భూములను ఇతరులు సాగు చేస్తున్నారని, విచారణ జరిపి తమ భూములను తిరిగి ఇప్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కలకొండ యాదగిరి,దార్ల రాములు,ఒగ్గు వెంకటేష్‌,దార్ల దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.ప్రత్యామ్నాయ శీర్షిక: భూముల ఆక్రమణపై రెవెన్యూ అధికారులకు బాధితుల ఫిర్యాదు

You may also like...