రోడ్డు ప్రమాదంలో హెచ్‌ఎం భూపతి దాస్ మృతి.. సర్పంచ్ ఘన నివాళి

1001327619.jpg

వెల్దండ నవంబర్ 04 :వెల్దండ బాలికల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూపతి దాస్ మంగళవారం సాయంత్రం తుక్కుగూడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అంకితభావంతో పనిచేసిన మంచి ఉపాధ్యాయుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఏ. రామ్‌రెడ్డి, ఉప సర్పంచ్ బి. శ్రీను,ప్రధానోపాధ్యాయుడు రవీందర్ నాయక్, ఉపాధ్యాయులు,వార్డు సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...