పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవాలి..మట్ట మదన్ కుమార్ గౌడ్
- కస్తూర్బా పాఠశాలలో మురుగునీటి సమస్యకు పరిష్కార చర్యలు - November 3, 2026
- పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకోవాలి..మట్ట మదన్ కుమార్ గౌడ్ - November 3, 2026
- పోతేపల్లి పట్టభద్రుల ఓటర్ల నమోదు.. తహసీల్దార్‌కు దరఖాస్తుల అందజేత - November 3, 2026
వెల్దండ, నవంబర్ 03: అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా మదన్ కుమార్ గౌడ్ కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి పట్టభద్రుడు ఎన్నికల్లో బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంగళవారం తహసీల్దార్ కార్తిక్ కుమార్‌ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం బీఎల్వో ఫారమ్‌ను అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మట్ట విష్ణుగౌడ్, కుశ కుమార్, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ జిల్లా సభ్యులు శశికుమార్, తానాషే యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
