గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం
- అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన బీజేవైఎం నాయకులు - November 2, 2026
- నర్సుల కొరతతో వెల్దండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అవస్థలు - November 2, 2026
- ఢిల్లీ సభకు తెలంగాణ నుంచి 15 వేల మందికి పైగా హాజరు.. ఎమ్మెల్యే కసిరెడ్డి - November 2, 2026
ఆరు నెలల పసికందుకు తండ్రిని దూరం చేసిన రోడ్డు ప్రమాదం
వెల్దండ,నవంబర్ 2: గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు మృతి చెందిన ఘటన వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జాజాల గ్రామానికి చెందిన బేతర్ వెంకటేష్ (30) గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని మీర్‌పేటలో నివాసముంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి తన ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 7 గంటల సమయంలో పెద్దాపూర్ గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద గుర్తుతెలియని వాహనం అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడికి రెండేళ్ల క్రితమే వివాహం కాగా, ఆరు నెలల పసికందు కుమార్తె ఉంది. కుటుంబానికి ఆధారమైన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.మృతుడి బంధువు క్యామ మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగిరెడ్డి యుగేందర్ రెడ్డి తెలిపారు.
