రక్తదానం ప్రాణదానంతో సమానం : నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
- రక్తదానం ప్రాణదానంతో సమానం : నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి - November 3, 2026
- జీవో 25ను సవరించకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం సాధ్యం కాదు.. - November 3, 2026
- అయిటిపాముల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి..మరొకరికి తీవ్రగాయాలు బైక్ పై వెళ్తుండగా ప్రమాదం - November 3, 2026
రక్తదానం ప్రాణదానంతో సమానం : నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 2 : రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడంచంచని నల్లగొండ డీఎస్పీ శిరాంరెడ్డి అన్నారు. సోమవారం కట్టంగూర్ లో బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ 7వ జిల్లా మహాసభల రెండవ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రక్తాన్ని కృత్రిమంగా తయారుల చేయడం సాధ్యం కాదని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపావవచ్చన్నారు. సమాజ సేవలో భాగంగా యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వచ్చందంగా రక్తదానానికి ముందుకు రావాలని పలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘం మహాసభల సందర్భంగా విద్యరంగ సమస్యలపై చర్చిండంతో పాటు సామాజిక సేవా కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసవారి జిల్లా అడిట్ కమిటీ కన్వీనర్ మిట్టపల్లి ముళరయ్య, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
