తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు
- తెలంగాణ ఉద్యోగులకు రెండు డీఏలు - September 23, 2026
- సీఎంతో TGEJAC నేతల భేటీ - September 23, 2026
- చెందిప్ప గేట్ హనుమాన్ ఆలయం పరిసరాల్లో రసాయన పౌడర్ - September 23, 2026

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం రెండు డీఏలు విడుదల చేసేందుకు అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. సీఎస్ సంజయ్ జాజుతో జరిగిన చర్చల్లో మొదటి డీఏను 3.46 శాతం, రెండో డీఏను 2.74 శాతంగా ప్రకటించినట్లు వెల్లడించారు. పెండింగ్లో ఉన్న మూడో డీఏను మరో 3-4 నెలల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు జేఏసీ నేతలు తెలిపారు. రెండు డీఏలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడిన అనంతరం అమలు తేదీ, చెల్లింపులపై పూర్తి స్పష్టత రానుంది.
