ఘనంగా పాండు నాయక్ జన్మదిన వేడుకలు
- జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కల్వకుర్తి అక్షర ఎంపిక - September 22, 2026
- మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం - September 22, 2026
- జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు - September 22, 2026
కల్వకుర్తి: కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం జిల్లా సీనియర్ నాయకులు ఎం. పాండు నాయక్ (రతన్ సింగ్) జన్మదిన సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,దిశ జిల్లా కమిటీ సభ్యులు ఎం. మోతీలాల్ నాయక్ పాండు నాయక్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు,అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
