గోలి గోపాల్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన సర్పంచ్ ప్రసాద్ గౌడ్
- జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కల్వకుర్తి అక్షర ఎంపిక - September 22, 2026
- మైసమ్మ కాలనీ గణనాధుని సన్నిధిలో మహా అన్నదానం - September 22, 2026
- జూరాల నీటి విషయంలో రైతులను తప్పుతోవ పట్టించొద్దు – మంత్రి జూపల్లి కృష్ణారావు - September 22, 2026

వెల్దండ: మండలంలోని అంకమోనికుంట గ్రామానికి చెందిన గోలి గోపాల్‌రెడ్డి (55) ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్‌గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి,గోపాల్‌రెడ్డి పార్థివదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాద సమయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గోపాల్‌రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, యువ నాయకులు సత్తూరి శేఖర్,వార్డు సభ్యులు నరేష్, పద్మమ్మతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
